హారివిచిత్రహేమకవచావృతు, డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పలవర్ణుడు, సేంద్రచాపశం
పారుచిమేఘమో యనగా బాండవమధ్యము డొప్పి బాణతూ
ణీరుడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్ను జూడగన్.
కుమారాస్త్రవిద్యాప్రదర్శనం జరుగుతూంది. ఇంతలో,
చూడటానికి మనోహరంగా ఉండి, వింతవింత రంగులు కలిగిన బంగారు కిరీటం ధరించినవాడు, అందమైన ధనుస్సు వ్రేలాడుతున్న పొడవైన బాహువులు కలిగినవాడు, ప్రకాశించే నల్లకలువ దేహచ్ఛాయ కలవాడు, అయిన పాండవమధ్యముడు అర్జునుడు, ఇంద్రధనుస్సుతో, మెరుపు కాంతితో కూడుకున్న మేఘమా అనేటట్లు, రంగమధ్యంలో వచ్చి నిలిచాడు.
నన్నయ భారతము, ఆదిపర్వము, షష్ఠాశ్వాసము నందలి కుమారాస్త్రవిద్యాప్రదర్శన ఘట్టములో, భావిభారత యుద్ధంలో ప్రతిస్పర్థులుగా పోరాడబోతున్న ఇద్దరు మహావీరుల వర్ణనలు చదువరులను ఆకొట్టుకుంటాయి. అందులో, మొదటిది యీ అర్జునుని వర్ణన.
No comments:
Post a Comment