నవ్యమైన కోకనద ముకుళము
ప్రొద్దుపొడుపువేళ పుల్లమైనట్లుగా
హనుమ వదనసీమ యందగించి.
సుగ్రీవుని ఆదేశంతో హనుమ భిక్షుక రూపంలో రామలక్ష్మణులను కలుసుకున్నాడు. హనుమ మాటతీరు చూసి ఇతడు వేదములను, ఉపనిషత్తులను, సర్వశాస్త్రముల సారాన్ని ఒడిసిపట్టిన జ్ఞానరాశి అని గ్రహించాడు రాముడు. సుగ్రీవుని దీనగాథను హనుమ ద్వారా తెలిసి కొన్ని రాముడు సుగ్రీవునితో మైత్రి నెరపడానికి సమ్మతించాడు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అడవులు పట్టినటువంటి, స్పర్శమాత్రం చేత శైవవైష్ణవ ధనుర్భంగం చేసిన, అన్నగారు రాముడు ఇప్పుడు వానరేశ్వరుడు సుగ్రీవుని శరణు కోరుతున్నాడని చెప్పాడు లక్ష్మణుడు. ఈ వినయపూర్వక వాక్యాలను విన్న హనుమంతుని అప్పటి రూప వర్ణనమే యీ పద్యము నందలి భావం.
ముడుచుకొని ఉన్న ఎఱ్ఱ తామరపూవు ఒక రెక్కను హంస తన ముక్కుతో చీల్చినప్పుడు, పొద్దుపొడుపువేళ ప్రకాశించినటుగా, హనుమ ముఖం అందంగా కనిపించిందట.
ఎంత అందమైన ఉపమానం !
హనుమంతుడు అనగానే మనకు కనిపించేది మూతి వద్ద ఎరుపు రంగులో సన్నని చీలిక ఉన్న వానర రూపం. ఆ రూపాన్ని ఒక చక్కని ఉపమానంతో వర్ణించడం మహాకవి ప్రతిభకు తార్కాణం.
ఇటువంటి ఉపమానాలు కల్పవృక్షములో కొల్లలు.
ఈ అందమైన ఆటవెలది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధాకాండము, నూపుర ఖండంలో ఉన్నది.
No comments:
Post a Comment