కినియమి, సంగవర్జన, మకించన భావము, తాల్మి, విప్రవా
సనము, ప్రశాంతి, యార్జవము, శౌచము, సద్వ్రతనిష్ఠ, భైక్షభో
జన, మిల నిద్రసేత, కృప, సంతత తత్త్వ విచింతనంబు,
మానిని ! యతి ధర్మముల్ శ్రుతి గణించిన భంగిన యేను జెప్పితిన్.
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసంలో శివుడు పార్వతికి యతి ఆచరించవలసిన ధర్మాలను వివరించటం కనిపిస్తుంది.
" కోపపడకుండా ఉండటం, విషయవాంఛల జోలికి వెళ్ళకుండా ఉండటం, తనదంటూ ఏమీ లేదనే భావం కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, దేశాంతరాన నివసించకుండా ఉండటం లేదా బ్రాహ్మణులతో కలిసి ఉండటం, శాంతస్వభావం కలిగి ఉండటం, ఋజుప్రవర్తన కలిగి ఉండటం, శుభ్రంగా ఉండటం, అహింస వంటి మంచి పనుల యందు శ్రద్ధ కలిగి ఉండటం, భిక్షాటన వల్ల లభించిన అన్నం భుజించటం, నేల మీద నిద్రించటం, దయాగుణం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ తత్త్వ విచారణ చేయటం - ఇవన్నీ సన్యాసి పాటించవలసిన ధర్మాలు. వేదం ఏదైతే చెప్పిందో నేను అదే చెప్పాను. "
సంగవర్జన మంటే పరమాత్మ సంబంధమైన విషయాలు తప్ప ఇతర విషయాల జోలికి వెళ్ళకుండా ఉండటం. భగవద్గీత కూడా ఇదే చెప్పింది.
" మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః
నిర్వైర స్సర్వభూతేషు యస్స మా మేతి పాండవ ! "
సమకాలీన సమాజంలో రమణమహర్షి, శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతిస్వామి వంటివారు పైన పేర్కొన్న యతి ధర్మాలను పాటించారు.
No comments:
Post a Comment