ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికి, బ్రపన్న వినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, ప్రథమస్కంధము లోని ఈ పద్యం విఘ్నేశ్వరుని స్తుతించేది.
పర్వతరాజు కూతురు పార్వతి హృదయానురాగాన్ని సంపాదించినవాడు, సమస్త పాపాలను పోగొట్టేవాడు, శరణాగతులకు సంతోషం కలిగించేవాడు, ఆటంకాలను తొలగించేవాడు, అందంగా మాట్లాడేవాడు, లోకము నందలి జనులకు ఆనందం కలిగించేవాడు, ఉండ్రాళ్ళు, కుడుములు ఆప్యాయంగా ఆరగించేవాడు, ఎలుక వాహనంపై ముల్లోకాల్లో తిరుగుతూ, శుభాన్ని కలుగజేసే వినాయకునికి నమస్కరిస్తున్నాను.
ఇది పిల్లలకు నేర్పదగిన చక్కని ప్రార్థన పద్యం.
No comments:
Post a Comment