జనిత మహాసమీరణవశంబున బేర్చి నగవ్రజంబుతో
మనుజులతోడ నిర్జరసమాజముతోడ భుజంగపంక్తితో
దనుజులతో జగత్రయము దత్ క్షణమాత్ర నొనర్చు నీఱుగన్ .
ఎఱ్ఱన పూరించిన శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వశేషం, చతుర్థాశ్వాసంలో, మార్కండేయుడు ధర్మరాజుకి ప్రళయం యొక్క తీరును వివరించాడు.
కృత, త్రేత, ద్వాపర, కలి అనే పేరు గల నాలుగు యుగాల కాలపరిమితి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. అట్టి వెయ్యి మహాయుగాలు ఒక బ్రహ్మదివసం (పగలు) అవుతుంది. బ్రహ్మదివసం చివర తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు సూర్యభగవానుడు, ఏడు మూర్తులతో, సప్తాశ్వరథాన్ని అధిరోహించి, నదీనదాలలోని, సముద్రాలలోని జలాన్నంతా పీల్చేస్తాడు.
" సూర్యుడి యొక్క తీక్షణమైన కిరణాలు, బాగా మండుతున్న అగ్నిహోత్రం రూపం దాల్చి, యుగాల చివరలో వీచే తీవ్రమైన గాలి తోడు కాగా, పెద్ద పెద్ద పర్వతముల, మనుష్యుల, దేవతల, భుజగముల, రాక్షసుల సమూహాలను, ఒక్క క్షణ కాలంలోనే బూడిద చేసేస్తాయి. "
మన ఋషులు ద్రష్టలు. తమ తపోబలం చేత విశ్వాంతరాళంలోని మహాద్భుత విషయాలను దర్శించగలిగే వారు. ప్రాచీన వాఙ్ఞయంలో సూర్యుడు ' సప్తహయుడు ' గా వర్ణించబడ్డాడు. అదే రీతిలో, ఎఱ్ఱన, మహాభారతంలో సూర్యుడిని సప్తహయుడిగా పేర్కొన్నాడు. మన శాస్త్రజ్ఞులు, ఈ సప్తవర్ణాలతో కూడిన ఇంద్రధనుస్సును, VIBGYOR అన్నారు.
No comments:
Post a Comment