గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల
త్కచ బంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దనకాంత జూడ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్.
అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంచడానికి శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని దాల్చాడు. అప్పటి ఆ రూపాన్ని చూడాలని శివుడు ముచ్చటపడ్డాడు. అదే విషయాన్ని శివుడు విష్ణువుకు చెప్పాడు. అప్పటికి ముసి ముసి నవ్వులు చిందించిన విష్ణువు, శివుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో మోహినీ అవతారం ఎత్తాడు. సమీపంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్నట్టుండి మొహిని దర్శనమిచ్చింది. ఆ యెలదోటలో, ఒక చెట్టు నీడలో సుందరాంగిని చూసాడు శివుడు. ఆమె తనూ విలాసానికి ముగ్ధుడై, ఆమె దగ్గరకు వెళ్ళాడు. శివుణ్ణి ఊరిస్తూ, ఆ జవ్వని దూరదూరంగా వెళ్ళింది. ఆ వాలుగంటి వాడి చూపులకు తట్టుకోలేక, నిగ్రహాన్ని కోల్పోయి, శివుడు తన ప్రక్కనే ఉన్న ఇల్లాలిని, ప్రమథ గణాలని కూడా మరచిపోయాడు. మోహిని ఒక పూబంతితో ఆడుకుంటూ, దానిని ఎగరవేసి పట్టుకుందామనుకుంది. బంతి పట్టుదప్పి జారి పడిపోయింది. బంతిని పట్టుకుందామని క్రిందకు వంగిన మోహిని చీరముడి ఊడిపోయింది. అది చూసిన శివుని మనస్సు చలించిపోయింది.
అప్పటి ఆ సన్నివేశాన్ని పోతన మహాకవి శ్రీమదాంధ్ర మహాభాగవతము, అష్టమ స్కంధములో అత్యద్భుతంగా వర్ణించారు.
" ఆ సుందరాంగి ముడివీడిన చీరను సరిగా కట్టుకొనడానికి క్రిందకు వంగింది. అప్పుడు ఆమె కుచద్వయం మీది పైటకొంగు జారింది. కొప్పుముడి వీడింది. పైటకొంగు జారటం వల్ల, ఆమె రెండు చేతులతోను వక్షస్థలాన్ని కప్పిపెట్టింది. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన శివుడు సిగ్గుపడుతూ, ప్రక్కనే భార్య ఉన్నా కూడా, ఆ సుందరాంగి దరిచేరాడు. "
జగన్మోహిని శృంగారచేష్టలను వర్ణించిన తీరు చూస్తే విష్ణుమాయను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని విశదమౌతున్నది.
No comments:
Post a Comment