నా కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా.
అందరి జంపి బావుకొనునట్టి జయంబు సుఖంబు నొల్ల గో
వింద ! ధరాధిపత్యమున నేమగు? భోగములేల? జీవితం
బంది ప్రయోజనంబు గలదా! యని యంచు విరక్తిభావమున్
పొంది ధనంజయుండు మది బొక్కుచు నెంతయు బల్కె నిట్టులన్.
" కృష్ణా! నేను యుద్ధంలో విజయాన్ని గాని, రాజ్యాన్ని గాని, సుఖాన్ని గాని కోరను. ఈ రాజ్యంతో, భోగాలతో, జీవితంతో మనకేమి ప్రయోజనం? "
ఈ మాటలు అర్జునుని తీవ్రమైన విరక్తిని సూచిస్తున్నాయి. ఆత్మజ్ఞానం పొందటానికి తీవ్రవైరాగ్యం మొదటిమెట్టు. శాస్త్రం కూడా ఇదే చెప్పింది. అకామహతుడవటం కూడా ముముక్షత్వానికి ఒక అర్హత. ఉపనిషత్సారమైన భగవద్గీతను బోధించడానికి ఇది సరియైన సమయం. కారణమేదైనప్పటికీ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమే దీనికి మంచి వేదిక. ఇందులో బోధించేవాడు నారాయణుడైన కృష్ణుడైతే, శ్రోత నరుడైన అర్జునుడు. కానీ, ఇద్దరూ ఒకే వెలుగుముద్ద లోని రెండు ముక్కలు.
No comments:
Post a Comment