శిష్యవాత్సల్యంబు చెలువుదీర్చిన మూర్తి
కాకవి కంఠంబు కత్తికోత
యెడద మెత్తదనంబు విడిదిచేసిన చోటు
వ్యర్థవాదములకు నగ్గిపిడుగు
భాషానుభవ పరీపాక స్వరూపంబు
నీరసవాది కన్నీటిముంపు
పరమ నిర్భీకుండు పరమసత్యవ్రతా
చారుండునున్ సత్వసంగరుండు
సమభిగమ్యత్వ మప్రధృష్యత్వ మొప్ప
వఱలు నట్టి చెళ్ళపిళాన్వవాయ శశికి
బరమ మస్మదుపజ్ఞ మౌ భవ్యసృష్టి.
దేర్చు ప్రథమమూర్తికిని జోదిళ్ళు పెట్టి.
విశ్వనాథవారి గురువర్యులు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు. ఆయన చెళ్ళపిళ్ళ వంశాబ్ధి చంద్రుడు. విశ్వనాథవారి ప్రతిభను మెరుగు దిద్దినవారు. అందువల్ల, గురువుగారి యొక్క ఋణం తీర్చుకొనేందుకు, తన ప్రతిభారూపమైన శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యసృష్టికి ప్రసన్నత్వం కలిగించేందుకు, వారికి అంజలి ఘటిస్తున్నారు విశ్వనాథ. మరి, తమ గురువుగారు ఎటువంటివారో చెబుతున్నారు.
శిష్యుల మీద ప్రేమకు ఒక అందాన్ని తీసుకొచ్చినవాడు. అయితే, అల్పకవుల మెడ మీద కత్తి లాంటివాడు. ఆయన హృదయం నవ్య నవనీతం. అయితే, అనవసర వాదాలకు మాత్రం అగ్గిపిడుగు వంటి వాడు. భాష మీద పట్టు, పరిణతి కలిగిన వాడు. అయితే, పసలేని వాదాలు చేసే వారి కంట నీరు పెట్టిస్తాడు. భయమంటే తెలియనివాడు. సత్యాన్ని వ్రతంగా పెట్టుకొన్నవాడు. సత్త్వగుణప్రధానుడు. మాటల్లో, చేతల్లో పొందిక కలవాడు. ఎదురులేనివాడు, ఖ్యాతి గడించినవాడు.
అటువంటి, తనను తీర్చిదిద్దిన గురువుగారికి, శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యరచనారంభ సమయంలో నమస్కరిస్తూ అవతారికలో యీ పద్యం చెప్పారు విశ్వనాథవారు.
No comments:
Post a Comment