కారుణికత్వ మగ్గలము గల్గి తలంతురు సర్వజీవులుం
దారును నొక్కరూపుగ బదంపడి పుత్ర కళత్రయుక్తి బెం
పారుదు రూర్థ్వలోకమున నజ్జనమున్ మఱివచ్చు గ్రమ్మఱన్.
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసంలో, శివపార్వతుల మధ్య ఆసక్తిదాయమైన, ఆలోచనామృతాన్ని కురిపించే చర్చ కనిపిస్తుంది.
పలు ఆధ్యాత్మిక విషయాలను అడిగి తెలుసుకుంటున్న అమ్మవారు, శివుడిని ఈ సారి ఒక చక్కని ప్రశ్న అడిగింది. చాలామంది మునీశ్వరులు తపస్సు తపస్సు అంటుంటారు గదా, ఆ తపస్సు యొక్క స్వరూప మేమిటో చెప్పమని అడిగింది. దానికి శివుడు, "భోగాశతో చేసే తపస్సులు, వానప్రస్థాశ్రమంలో ఫల కందమూలాలను స్వీకరిస్తూ, ఇంద్రియనిగ్రహంతో చేసే తపస్సు, కఠోరంగా పంచాగ్ని మధ్యంలో చేసే తపస్సు - ఇవన్నీ స్వర్గప్రాప్తి కలిగిస్తాయి. ఆ పుణ్యఫలం తీరిపోగానే, మళ్ళీ మర్త్యలోకంలో పునర్జన్మ కలిగిస్తాయి " అని చెప్పాడు. ఆంతేగాక:
" మున్యాశ్రమాలలో ఉంటూ గృహస్థాశ్రమాన్ని పాటించే మునులు అహింసను పరమధర్మంగా భావిస్తారు. వారికి దయాగుణం యెక్కువ. అన్నీ ప్రాణులనూ సమభావంతో చూస్తారు. అటువంటివారు కూడా, ఆయువు తీరిన తరువాత పుణ్యలోకాలకు పోయి అక్కడ సుఖా లనుభవించి, తమ పుణ్యఫలం అయిపోగానే, మరల భూలోకంలో మనుష్యులుగా పుడతారు. "
శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ' రాజవిద్యా రాజగుహ్య యోగం (20-21 శ్లోకాలు) పై విషయాన్ని ధృవపరుస్తున్నాయి.
No comments:
Post a Comment