త్తంసము నాగమాంత విదితధ్రువపుణ్యరమావతంసమున్
కంసజిఘాంసు నంశమును గర్బురసూత్ర సమావృతాంసమున్
హింస నడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్.
ఇది చతుర్ముఖబ్రహ్మ స్తుతి పద్యం.
హంస వాహనంగా కలవాడు, పరమ హంస, దేవతలలో ఉత్తముడు, వేదాంతంలో చెప్పబడిన పుణ్య శోభను సంతరించుకొన్న వాడు, కంసుని సం హరించిన కృష్ణుని అంశ కలవాడు, స్వర్ణ యజ్ఞోపవీతాన్ని ధరించిన వాడు, హింసను అణచివేసే వాడు, అయిన బ్రహ్మదేవుడిని, సకల శుభాలను చేకూర్చటం కోసం ప్రార్థిస్తున్నాను. "
ఈ పద్యం పోతన మహాకవి శిష్యుడు ఏర్చూరి సింగయ కవి ఆంధ్రీకరించిన భాగవతము, షష్ఠ స్కంధము లోనిది.
No comments:
Post a Comment