కఠినస్తనోపరి గ్రైవేయ మణికాంతి కర్ణతాటంకంబు గాడిపఱుప
కమ్రనితంబాగ్ర కాంచికింకిణులతోఁ గరకంకణధ్వనుల్ కలఁతఁ బూన
మౌళిక్లప్త శశాంక మాలాతపములపై ఫాలస్థలీజ్యోతి పాఱువెట్ట
దత్కాల విచలితాధర హాస మాధుర్య మాత్మప్రసన్నత నగడుపఱుప
పాలితాన్యోన్యలంఘన స్పర్థములును
జాలితాన్యోన్య సౌందర్య సరసములును
నైన పలుకుల కూడిక యనఁగ నొప్పు
శారదామూర్తి నా యెదఁ జాలుగాక.
No comments:
Post a Comment