వరుణదేవుని యొక్క మహిత ప్రథమరూపంబైన దొరకు
ధరణి దేవత నెప్డు కన్నతండ్రినాఁ దన కౌగిటఁ బొ
నరఁ దాల్చుచున్నట్టి జలధినాథుని నా నతుల్ పొందు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనిది.
సీతాన్వేషణకై సముద్రాన్ని దాటబోతున్న హనుమంతుడు అభీష్టసిద్ధి కోసం ఇష్టదేవతా ప్రార్థన చేశాడు. ఇది సముద్రుని స్తుతించే పద్యం.
ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. అందులో వరూణదేవుడు ప్రముఖంగా పేర్కొనబడ్డాడు. అటువంటి వరుణదేవుని యొక్క మొదటి రూపం జలాధిదేవత అయిన సముద్రుడు. భూదేవతను కన్నకొడుకు లాగా కౌగిటిలో పొదివి పట్టుకొన్న ఆ సముద్రుడికి నా నమస్కారాలందజేస్తున్నానని హనుమంతుడు సముద్ర లంఘనోద్యక్తుడయ్యాడు.
No comments:
Post a Comment