ణాతురుఁడైనవాఁ డడుగ నైన సమస్త విధాల నడ్గితిన్
రాతిరి పన్నిపోయిన కిరాతికి నుచ్చునఁ జిక్కి ప్రొద్దుటన్
భీతిని బ్రార్థనాక్షులను బెట్టిన కృష్ణమృగంబుకైవడిన్.
అని సమాసన్న విలయవేళా తీవ్రనిశ్వసనంబున మూర్ఛితుండు వలెనైన
పతివచోభిముఖీనమౌ పడఁతియాత్మ
నిముసనిముసంబునకు నేదొ నిలువరించె
క్ష్మాతలేంద్రుఁడు దుఃఖవాచాలుడైన
దరుణి కైకేయి దుఃఖనిస్తబ్ధయయ్యె.
కైకేయి కోరిన వరాలతో దశరథుడు కుప్పకూలిపోయాడు. బ్రతిమాలాడు, భంగపడ్డాడు. భరతుడిని రాజును చేస్తానన్నాడు. రాముడిని అడవులకు పంపే మాట మాత్రం వద్దన్నాడు. కైక పట్టిన పట్టు విడవక పోవటంతో, దీనుడైన దశరథుడు ఇలా అన్నాడు.
" మొదటి నుండి నువ్వు రాముడి మీద నింపుకొన్న ప్రేమను తలచుకొని, పట్టు విడుస్తావేమో నని ఆశ కలిగింది. ప్రాణాలణు అరచేతులలో పెట్టుకొన్నవాడు ఏ విధంగా అడుగుతాడో, ఆ విధంగా అడగవలసిన అన్ని రీతులలో నిన్ను అడిగాను. రాత్రివేళ వలపన్ని పోయిన కిరాతస్త్రీకి చిక్కి, ప్రొద్దున్నే ఆమె వంక బెదిరే కళ్ళతో చూస్తున్న జింక లాగా ఉంది నా పరిస్థితి. "
అంటూ , ముంచుకొస్తున్న ఆపదవేళ తీవ్రమైన నిట్టూర్పు విడిచి, మూర్ఛపోయేవాడి వలె అయిన దశరథుడి పరిస్థితిని చూసి, భర్త మాటలవైపు మొగ్గుచూపుతున్న కైక ఆత్మను, ప్రతి నిముషం ఏదో పట్టి ఆపుతున్నది. దుఃఖంతో ఏO మాట్లాడుతున్నాడో తెలియకుండా, దశరథుడు ఉంటే, దుఃఖాన్నంతా హృదయంలోనే అణచుకొని కైకేయి మిన్నకుండిపోయింది. "
కైక దుఃఖనిస్తబ్ధురాలవటానికి, దేవతల, ఋషుల తీవ్రభావన కారణమేమో?
ఎంత కరుణరసాత్మకమైన భావన ! విశ్వనాథ కైకేయీ పాత్రచిత్రణం గురించి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం?
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment