డము నీ భక్తుఁడు శోభనాద్రిదగు సంతానంబు జన్మాద్యపా
యముఁ దప్పించుత ! యెన్ని పుట్టువుల పెట్టైతిన్ శివా ! యేమి కా
మము? కోపంబదియేమి? యేమియగు నీ మాత్సర్యమోహో ! ప్రభూ !
ఇది మెచ్చెదరో మెచ్చరొ?
యిది యును జదివెదరుఁ జదువ రేలా నాక
య్యది? నా యెద మీతో రా
చెద నద్దానికి ఫలంబుఁ జెందించు శివా !
హాళి జరించుఁ గావ్యరచనాత్తయశఃకృత నాకసౌఖ్యవాం
ఛాలులితంపుటాత్మయె పొసంగదు నాదెసఁ బొందుఁగాక ము
క్త్యాల ధరాధినాయకుఁడదంతయు, నా తపమెల్లఁ బండి యు
ద్వేల జనూరుజావితతి విచ్చెడునట్టు లనుగ్రహింపవే?
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము లోని ఐదు ఖండాలను పూర్తిచేసిన తరువాత, విశ్వనాథ చెప్పిన ఖండాంత పద్యాలివి.
" ప్రభూ ! నీ భక్తుడిని, శోభనాద్రి కుమారుడిని, అయిన నేను బాలకాండాన్ని, స్వర్గలోకపు స్త్రీల శిరోజాల నలంకరించే పారిజాత పుష్పమంత స్వాదువైన ఊహలతో రచించాను. దానికి ఫలంగా, నన్ను జననమరణ చక్రం నుండి తప్పించు. ఈ ఒక్క పుట్టుకే నాకు ఎన్నో జన్మల పెట్టుగా ఉంది. ఇవేమి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు? శివా ! వీటి నుండి నన్ను తప్పించు.
నా రామాయణాన్ని మెచ్చుకుంటారో, మెచ్చుకొనరో, చదువతారో, చదవరో అన్న మీమాంస నాకు లేదు. రామాయణ రాచన ద్వారా, నా గుండెను నీ గుండెతో రాపిడి పెట్టాను. దాని కేమైన ఫలముంటే, అది నాకివ్వు.
ఎంతో అనురక్తితో నేను చేసిన ఈ రామాయణ కావ్యరచన వల్ల కలిగే యశస్సు, అల్పమైన స్వర్గసౌఖ్యాలు నాకు రుచించవు. ఆ స్వర్గలోక సుఖాలన్నీ ముక్యాలప్రభువు పొందేటట్లు చెయ్యి. నా ఉపాసన, నా తపస్సు పండి, దుస్సహమైనటువంటి యీ పుట్టుక అనే రోగం (భవరోగం) నుండి విముక్తి పొందేటట్లు అనుగ్రహించు. "
పుట్టుక అనేది ఒక రోగం. దానినే భవరోగం అంటారు. ఈ భవరోగమే అన్నీ రకాలైన వికారాలకు, ద్వంద్వ భావాలకు మూలకారణం. అందుచేత, పుణ్యప్రదమైన రామాయణకావ్య రచన వల్ల కలిగే ఫలాన్ని తనకు జన్మరాహిత్యం ద్వారా కలిగించమని కోరుకుంటున్నారు విశ్వనాథ.
No comments:
Post a Comment