ర్పడగాఁ గావ్యత, సంస్కృతం బొలసి యాంధ్రంబయ్యె నీ తెల్గుమేల్
నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళున్ జాతి మాట్లాడు కై
వడి సత్కావ్యములొప్పు నాంధ్రమున, నా రామాయణం బట్టిదే.
" కావ్యత అంటే కావ్యగౌరవం లేక కావ్యార్హత. ఒక రచనకు కావ్యగౌరవం రావాలంటే దానికి కొన్ని కావ్య లక్షణా లుండాలి. కావ్యాలంకారాలు, కావ్యవృత్తులు, కావ్యగుణాలు, కావ్యరీతులు, వ్యంగ్యము అనేవి రచనకు కావ్యగౌరవాన్ని తెచ్చిపెడతాయి. అన్ని భారతీయ భాశలకు సంస్కృతం తల్లి వంటిది. సంస్కృత భాష వ్యాప్తి చెంది ఆంధ్ర భాషగా మారింది. తెలుగుజాతి మాట్లాడే నుడికారాలు, దేశ్యాలు, పలుకుబడులు, మొదలైనవి తెలుగులో సత్కావ్యానికి కావలసిన సామాగ్రి. నా రామాయణం అటువంటిదే.
ఇదీ సత్కావ్యాన్ని గురించి విశ్వనాథ వ్యాఖ్యానం.
తెలుగుగులో సత్కావ్య లక్షణాలను గురించి చెప్పిన ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో ఉంది.
No comments:
Post a Comment