వశ్యుల్ గానయి కోసలంబు బహుకృత్వఃప్రాప్తసస్యం బగున్
శ్రీ శ్యామాంబుద మాలికాతతులతోఁ జేరున్ భవద్గేహముల్
భ్రశ్యచ్ఛోకము పూర్ణవాంఛలుగ భూపా ! పుత్రసంతానముల్.
ఋష్యశృంగుని అధ్వర్యంలో దశరథుడు అశ్వమేధ యాగం చేసి పుత్రసంతానం పొందుతాడన్న విషయం తాను సనత్కుమారుడు ఋషిసంఘంతో చెప్పగా విన్నానని సుమంత్రుడు రాజుకి చెప్పాడు. అందుకని, ఋష్యశృంగమునిని త్వరగా అయోధ్యకు ఆహ్వానించమని సుమంత్రుడు దశరథునికి చెప్పాడు.
" అల్లుడైనటువంటి ఋష్యశృంగముని నీ ఇంట్లో ఉంటే, దేవతలు నీ వశమై, కోసలదేశం బహుధాన్య సంపదలతో వర్థిల్లుతుంది. ఎందుకంటే, ఆ మహాత్ముడు, వర్షం కురిపించే నల్లని మేఘమాలికలతో నీ ఇంటికి చేరుకుంటాడు. దానితో, నీ శోకం తీరి, వాంఛాఫలపూర్తిగా నీకు పుత్రసంతానం కలుగుతుంది "
సుమంత్రుడు ఋష్యశృంగుడిని " హ్రీశ్యామాక్షుడు " అని వర్ణించాడు. వివాహానికి పూర్వం, ఋష్యశృంగుడు స్త్రీపురుష భేదం తెలియనివాడు. అందువలన, ఆ మహాత్ముని నల్లని కనుపాపల్లో ఆ సిగ్గుపడే తత్వం ప్రతిబింబిస్తుందేమో ! ఆ హ్రీశ్యామాక్షుడు ఎక్కడ కాలు పెడితే అక్కడకు నల్లని మేఘమాలికలు రావా? అవి వర్షించి నీలమేఘశ్యాముడితో పాటు, ఆయన అంశలను వెంటపెట్టుకు రావా?
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోని యీ పద్యం చదువుతుంటే, ఆషాఢమేఘం వంటి ఋష్యశృంగమౌని కనుల ఎదుట సాక్షాత్కరిస్తాడు. అహో ! ఏమి విశ్వనాథ ! ఏమి యీ ఋషిత్వం?
No comments:
Post a Comment