భ్రాజచ్చండ మహాగ్నిగర్భము మహాప్రారంభపౌష్కల్య మం
భోజాంతస్థితకర్ణికాభము మహామోఘప్రభావంబు వే
ళా జాగర్యము నిత్యతృప్తము విశాలస్కంధ మాభీలమౌ
నాజానేయ మొకండు దూఁకినది లంకాగ్రక్ష్మాభృత్తటిన్.
తీక్షణంగా ప్రకాశించే మహాగ్నిగర్భంతో, సమృద్ధమైన మహాప్రారంభ వేగంతో , తామరపువ్వు మధ్యలోని దుద్దు యొక్క రంగులో, అమోఘమైన ప్రభావంతో, సమయానికి తగ్గట్లు జాగ్రత్త వహిస్తూ , నిత్యతృప్తమై, విశాలమైన మూపురం కలిగినదై, భయంకరాకారంతో ఒక మేలుజాతి గుర్రం లంకారాజ్య భూభాగం మీద దూకింది
ఇది విష్ణువు అవతారమైన హయగ్రీవుని స్వరూపం. పంచముఖాంజనేయుని స్వరూపంలో, హయగ్రీవ రూపం ఊర్థ్వముఖమై, సర్వవిద్యా జ్ఞానప్రాప్తిని సూచిస్తుంది.
ఈ పద్యానికి సంతృప్తికరమైన అర్థం, హయగ్రీవుని పరంగా, నాకు తోచలేదు. అందుకు మన్నించమని వేడుకొంటున్నాను.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనిది.
No comments:
Post a Comment