ప్పవలెన్, వాయుసుతుండు నా గురువు చెప్పం జేయఁగా నేర్పె, నీ
యవివేకంబున కబ్బురం బొదవు దైత్యా ! తల్లికిం దండ్రికిన్
వ్యవధానంబు ఘటించినాఁడవు గదయ్యా యొక్క యేడాదిగన్.
కాదని నీ వెఱుంగుదనఁగల్గిన లక్షణముండె నీకు మం
డోదరివంటి దేవికి ననుంగుమగండవు, భర్తృ సువ్రతా
పాదక లక్షణంబులను బ్రత్యహముం గనుచుండి నేరవన్
వాదన నెట్లు చేయవలెఁ బండితుఁడై మొఱకైన యట్లుగన్.
నీ వలనన్ విభీషణుఁడు నిర్గతుఁడై రఘురాముఁ జేరె సు
గ్రీవుఁడు నన్నగారిని హరించెను, రెండును లోకదృష్టికిన్
గావలమైన పాపములుగాఁ గనిపించును గాని ప్రాపకం
బై వెలయున్ రఘూత్తముఁడటన్నది తానఘహారియౌఁజుమీ.
అంగదుడు దూతగా రావణుని దగ్గరకు వెళ్ళి రాముని సందేశాన్ని వినిపించాడు. ఆ తరువాత తన వంతుగా ఇలా చెప్పాడు.
" ఇంతవరకు నేను చెప్పినవి రాముని మాటలు. కిష్కింధ నుండి ఇంతదూరం వచ్చిన నేను కూడా ఏమైనా చెప్పాలి కదా ! ఎందుకంటే, మంచి మాటలను చెప్పటం కానీ, మంచి పనులు చేయటం కానీ మా గురువుగారు హనుమంతుడు నాకు నేర్పారు.. రావణా ! నీ అవివేకానికి నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఎందుకంటే, తల్లికి తండ్రికి ఒక ఏడాదిపాటు ఎడబాటు కల్పించావు కదయ్యా !
అదీకాకుండా, నీకు తెలుసు అనతగ్గ విషయం ఒకటుంది. అదేమంటే, నువ్వు మండోదరి వంటి ఆమెకు భర్తవు. ఆమె పాతివ్రత్య లక్షణాలను ప్రతిక్షణం చూస్తూనే, నీకేమీ తెలియదని ఎట్లా వాదన చేయగలవు? అట్లా చేస్తే, పండితుడైనవాడు మూర్ఖంగా వాదించినట్లవుతుంది..
నీ చేత వెళ్ళగొట్టబడిన నీ తమ్ముడు విభీషణుడు దారీతెన్నూ లేక శ్రీరాముని పంచన చేరాడు. సుగ్రీవుడు రామునితో మైత్రి చేసి అన్నగారు వాలిని చంపించాడు.. లోకం దృష్టిలో ఈ రెండు ఘోరమైన పాపాలుగా కనిపించవచ్చు కానీ, పాపప్రక్షాళణశీలుడైన రఘురాముని పొందు వలన అవి శరణాగతిగా వెలుగొందుతాయి సుమా ! "
అంగదునికి పినతండ్రి సుగ్రీవుని మీద కన్నా, రామునిపై భక్తిభావం, హనుమంతునిపై గురుభావం యెక్కువ. జగత్తుకు మాతాపితరులైన సీతారాములను విడదీయటం మహాపాపమని, పతివ్రత అయిన మండోదరికి భర్త అయి ఉండికూడా, పరుని భార్యను దొంగిలించటం హేయమని అంగదుడు నిర్ద్వంద్వంగా తెలియజేసాడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ద కాండము, సంశయ ఖండము లోనివి.
No comments:
Post a Comment