గ్రైవేయీకృతు శోభనాద్రిసుతుఁడన్ గారుణ్యమాధుర్యరే
ఖావి త్తిర్పతివేంకటేశ కవితాగంగా హిరణ్యాబ్జమా
లా వైకక్షకమూర్తి సాధుసుజనాలాప ప్రయుక్తాత్ముఁడన్.
నైకోద్రిక్త జనుర్నిమిత్తక మదేనఃపుంజమున్ దా నయో
ధ్యాకాండ మ్మిది సాహితీవిమలతీర్థం బార్పుతన్ వెండికొం
డై, కైలాసము నందమూ రగుట మేలై, నీవు నీవై, యుమే
శా ! కైలాసము కాదొ నీ యెచట ను న్నాచోటు విశ్వేశ్వరా !
చేయగలన్ని పాపములు చేసితి మున్ వెనుకల్ గణింపకే
చేయఁగనైన పున్నెములు చేసితి నీ దయకల్గుదాఁక దూ
రాయితమయ్యె నీ జనిదురాత్మత, రామకథాప్రపూర్తి వే
ళాయుతిగాఁగ దేహ మవలంబనచేయుము చాలునో ప్రభూ !
మహాకావ్యాలను చదివిన పండితులు, విమర్శకులు, ఆ కావ్యాల పట్ల వారి స్పందనను సాహిత్య పరిభాషలో చక్కగా వెలిబుచ్చుతారు. సామాన్య పాఠకుడి పరిస్థితి వేరు. కానీ, సగటు పాఠకుడికి కూడా హృదయస్పందన ఉంటుంది కదా !
ఏ పూర్వజన్మ పుణ్యఫలమో, విశ్వనాథ గురువర్యుల అనుగ్రహమో, వారికి ఏకలవ్య శిష్యుడినైన నాకు, కల్పవృక్షచ్ఛాయలో సేదదీరే, భాగ్యం లభించింది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని ఖండాంత పద్యాలు చదువుతుంటే, కొంత ఆత్మానాత్మవిచారణ చేయగలిన సంసారజీవుడు, తన జీవిత పరమార్థ మేమిటని ప్రశ్నించుకొనక మానడు.
అనసూయ ఖండము చివరలో నున్న ఈ పద్యాలు, అయోధ్యా కాండ రచన పూర్తి చేసిన సందర్భములో చెప్పినవి. విశ్వనాథ, పరమేశ్వరునికి, ఏం నివేదించుకుంటున్నారో చూద్దాము.
" శివా ! మహాకవులచేత పోషింపబడిన సర్వ కవిత్వ రహస్యాలను తెలిసినవాడిని. పుట్టుక చేత శోభనాద్రి కుమారుడిని. జానకీపతి రాముడు, సర్పాంగదకంఠభూషణుడు శివుని చేత తీర్చిదిద్దబడినవాడిని. తిరుపతివేంకటకవుల శిష్యుడిగా, వారి కారుణ్యం తో పాటు కవితామాధుర్యమనే గంగాస్నానం చేసి, ఆ కవితా గంగలోని బంగారం రంగులో కల పద్మముల పూదండను జందెంగా వేసుకున్నవాడిని. స్వాదువు, సుజనాహ్లాదకరమైన కవిత్వాన్ని వ్రాసేవాడిని.
ఉమాపతీ ! పుట్టుకతో అనేక విధాలైన ఉద్రిక్తతలు వస్తాయి. ఆ ఉద్రిక్తతలతో, నేను ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాగ్నిని ఆర్పగల సాహితీవిమలతీర్థం నేను వ్రాసిన అయోధ్యా కాండం. అటువంటి అయోధ్యా కాండం వెండికొండై, నందమూరు కైలాసమై, నందమూరు లోని శివలింగం నీవై, నువ్వెక్కడ కొలువుంటే అది కైలాసం కాదా !
ఓ ప్రభూ ! ముందు వెనకలు చూడకుండా, చేయగలిగినన్ని పాపాలు నేను చేశాను. నీ దయతో, చేయగలిగినన్ని పుణ్యకార్యాలు చేశాను. ఈ భవరోగం భరించరానంత దుర్భరంగా ఉంది. నేను మొదలుపెట్టిన రామకథారచన పూర్తయ్యేంతవరకు, ఈ మహాకావ్యాలను చదివిన పండితులు, విమర్శకులు, ఆ కావ్యాల పట్ల వారి స్పందనను సాహిత్య పరిభాషలో చక్కగా వెలిబుచ్చుతారు. సామాన్య పాఠకుడి పరిస్థితి వేరు. కానీ, సగటు పాఠకుడికి కూడా హృదయస్పందన ఉంటుంది కదా !
ఏ పూర్వజన్మ పుణ్యఫలమో, విశ్వనాథ గురువర్యుల అనుగ్రహమో, వారికి ఏకలవ్య శిష్యుడినైన నాకు, కల్పవృక్షచ్ఛాయలో సేదదీరే, భాగ్యం లభించింది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని ఖండాంత పద్యాలు చదువుతుంటే, కొంత ఆత్మానాత్మవిచారణ చేయగలిన సంసారజీవుడు, తన జీవిత పరమార్థ మేమిటని ప్రశ్నించుకొనక మానడు.
అనసూయ ఖండము చివరలో నున్న ఈ పద్యాలు, అయోధ్యా కాండ రచన పూర్తి చేసిన సందర్భములో చెప్పినవి. విశ్వనాథ, పరమేశ్వరునికి, ఏం నివేదించుకుంటున్నారో చూద్దాము.
" శివా ! మహాకవులచేత పోషింపబడిన సర్వ కవిత్వ రహస్యాలను తెలిసినవాడిని. పుట్టుక చేత శోభనాద్రి కుమారుడిని. జానకీపతి రాముడు, సర్పాంగదకంఠభూషణుడు శివుని చేత తీర్చిదిద్దబడినవాడిని. తిరుపతివేంకటకవుల శిష్యుడిగా, వారి కారుణ్యం తో పాటు కవితామాధుర్యమనే గంగాస్నానం చేసి, ఆ కవితా గంగలోని బంగారం రంగులో కల పద్మముల పూదండను జందెంగా వేసుకున్నవాడిని. స్వాదువు, సుజనాహ్లాదకరమైన కవిత్వాన్ని వ్రాసేవాడిని.
ఉమాపతీ ! పుట్టుకతో అనేక విధాలైన ఉద్రిక్తతలు వస్తాయి. ఆ ఉద్రిక్తతలతో, నేను ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాగ్నిని ఆర్పగల సాహితీవిమలతీర్థం నేను వ్రాసిన అయోధ్యా కాండం. అటువంటి అయోధ్యా కాండం వెండికొండై, నందమూరు కైలాసమై, నందమూరు లోని శివలింగం నీవై, నువ్వెక్కడ కొలువుంటే అది కైలాసం కాదా !
ఓ ప్రభూ ! ముందు వెనకలు చూడకుండా, చేయగలిగినన్ని పాపాలు నేను చేశాను. నీ దయతో, చేయగలిగినన్ని పుణ్యకార్యాలు చేశాను. ఈ భవరోగం భరించరానంత దుర్భరంగా ఉంది. నేను మొదలుపెట్టిన రామకథారచన పూర్తయ్యేంతవరకు, ఈ శరీరానికి ఊతమివ్వు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో, విశ్వనాథ, తన తండ్రి ఆజ్ఞ, జీవుడి వేదన రెండూ కలిసి, రామాయణాన్ని వ్రాయటానికి తనను ప్రేరెపించాయని చెప్పారు. ఆ జీవుని వేదన ఖండాంత పద్యాలలో ప్రతిబింబిస్తున్నది.
No comments:
Post a Comment