గదలెదు గాని, నిల్పుకొనఁగా నిలుపోఁపఁగఁ జాల, నేమి యె
ల్లిద మిది ! నందమూరి శివలింగముగాఁ గనిపింతు, పోదువున్,
బదపద ! వెండికొండకునె వచ్చెద, నీ విట నిల్వలేనిచో.
భక్తి భావం, భక్తిభావానికి తగిన ఊహ. వెరసి విశ్వనాథ.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్థాన ఖండము లోనిది.
విశ్వనాథవారి స్వగ్రామం నందమూరులో శివాలయం, వేణుగోపాలస్వామి గుడి ఉన్నాయి. ఆ ఇద్దరు మూర్తులు బాల్యం నుండి విశ్వనాథకు చెరగని ముద్రలు. విశ్వనాథకు ఆ ఇద్దరూ ఒకరే.
" అర్థనిమీలితనేత్రాలతో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, నా గుండె లోపలి పొరల్లో కదులుతూ ఉంటావు. కానీ, అప్పుడు నీ మీద ఎక్కువసేపు చూపు నిలుపుకోలేను. నందమూరులోని శివలింగంగా కనిపిస్తావు, మరల అదృశ్యమౌతావు. నేనంటే నీకెంత చులకన ! ఇలా కాదు గానీ, నువ్విక్కడ ఉండలేకపోతే, పద, నేనే వెండికొండకు వస్తాను. "
ధ్యానసమాధిలో ఉన్నప్పుడు క్షణమాత్రం ఆనందమయం చేసే ఆ పరమేశ్వరభావనను శాశ్వతం చేసి, బ్రతుకును పండించమని కవి కోరుకొంటున్నాడు. వెండికొండ మీద ఎప్పుడూ పరమేశ్వరుని సాన్నిధ్యంలో ఉండాలని ఆకాంక్ష.
No comments:
Post a Comment