మీసలు గడ్డముల్ మీ ముఖచిబుక గల్లముల మెలఁగనే మెలంగవొక్కొ
నాకు మొగాననున్నది యొక్కకొమ్ము ఱొమ్ముల మీకు జంటలై పుట్టెనొక్కొ
యెపుడు సర్వాంగాసనపు నిష్ఠచేతనే పిఱుఁదులు మీ కింత పెఱిఁగెనొక్కొ
యనుచు వారల జడలంటు నాననములు
తడుము నురములు తాఁకు ముట్టెడును బిఱుదు
లట్లు సేసియు నచ్చోటి కసమశరుఁడు
తొంగి చూడఁడు ముని ఋష్యశృంగువంక.
ఋష్యశృంగుడు స్త్రీపురుష భేదం తెలియకుండా పెరిగిన మునికుఱ్ఱవాడు. విభాండకుని కొడుకు. అంగదేశం లోని అనావృష్టిని పారద్రోలడానికి, కొందరు వారకాంతలు ఋష్యశృంగుడు ఉండే అరణ్యప్రాంతానికి వెళ్ళారు. వేశ్యల నృత్యగానాలకు పరవశించిన ఋష్యశృంగుడు, వారకాంతల తనుసౌందర్యాన్ని, అవయవ విశేషాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఋష్యశృంగుడు వేశ్యలతో ఇలా తర్కించాడు.
" మీ తలమీద జడలు చక్కగా, నునుపుగా, మూడు పేటలుగా అలాగే పుట్టాయా? మీ ముఖం మీద, చిబుకం మీద, చెక్కిలి మీద గడ్డం, మీసాలు మొలవవా? నాకు శిరస్సున ఒక్క కొమ్ము ఉంటే, మీకు ఱొమ్ములో రెండు కొమ్ము లున్నాయే? ఎప్పుడూ సర్వాంగాసనాలు దీక్షగా వేయటం వల్ల, మీ పిఱుదులు బాగా పెరిగాయా?, అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తూ, ఋష్యశృంగుడు వారి జడలు, ముఖాలు, తడుముతున్నా, వక్షస్థలాన్ని తాకుతున్నా, పిఱుదులు ముట్టుకున్నా, మన్మథుడు ఆ మునికుఱ్ఱ వైపు కనీసం తొంగి చూడటమైనా చేయలేదు. "
ఈ సీసపద్యం ఋష్యశృంగుని శీలానికి మచ్చుతునక.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనిది.
No comments:
Post a Comment