క్ష్మాయోషన్ విడి నీవు పొమ్మన, శిరఃకల్హారమాలాకృతిన్
నా యాజ్ఞంగొని రాముఁ డేగుఁజుమి కాంతారమ్ము, ధాత్రీశుఁడే
లా యంగీకృతిఁజూపు నౌ నెపము వాలాయంబు గల్పించెదన్.
మంథర మాటలను విన్న కైక నిరాదరం సూచించేటట్లుగా ఆమె వంక చురుక్కున చూసింది. దానితో, ఒక్కపెట్టున ఏడుస్తూ, చీర అంచును చింపుకొని, ఉరి వేసుకొనడానికి సిద్ధపడింది మంథర. ఆ దృశ్యాన్ని చూసిన కైక, మనస్సహజ దౌర్బల్యానికి వశమై పోయి, మంథరను వారించి, ఆమె చెప్పినదంతా నిజమేనా అని అడిగింది. మంథర ఒట్టు వేసి మరీ గట్టిగా కైకకు నచ్చచెప్పింది. కైక ఒక్కసారిగా ఏదో పూనినట్లుగా లేచి, శోభాదరిద్రమగు వాక్యవైఖరితో ఇలా అన్నది.
" ఓయి రాఘవా ! ఈ భూమి మొత్తాన్ని నా కొడుకు ఏలుకుంటాడు సుమా ! మంథరా! " రాజ్యాన్ని వదలి నీవు వెళ్ళిపో " అని ఒక్క మాటంటే చాలు, తల మీద పూదండను దాల్చినట్లుగా, నా మాటను శిరసావహించి, రాముడు వనవాసానికి పోతాడు. ఇక మహారాజు దీనికే రకంగా అంగీకారం తెలుపుతాడంటే, నేనాయన మీద వత్తిడి తీసుకువస్తాను. "
కైకేయి వాక్యవైఖరి వెనుక అభిషేకం చేసుకొనగూడదన్న రాముని ఆకాంక్ష, దేవతల, ఋషుల భావన, చివరగా తనను పెంచిన దాది ఒత్తిడి పనిచేసి, తనకు ఇష్టమున్నా లేకున్నా, రాముని వనవాసానికి ఒప్పుకొన్నదని వ్యాఖ్యానించవచ్చు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment