విలయపయోధి, ప్రాణితతి బీజములన్నియు సంగ్రహించి, యు
జ్జ్వలతరమైన పెద్ద తెరచాఁప ఘటించి హిరణ్యగర్భుఁడం
బుల విహరించు నోడకడుపుంబలె దంతచయంబు జిహ్వయున్
గలిగిన నోరు కన్గొని ప్రకంపనసూనుఁడు సంతసించుచున్.
బొట్టనవ్రేలియంత పొడవుంగని బుద్ధిమదగ్రగణ్యుఁడి
ట్టట్టనకుండ నామె వివృతాస్యముచొచ్చి వినిర్గమించి నీ
పట్టినపట్టు చెల్లినది వక్త్రముచొచ్చితిఁ దిర్గి వచ్చితిన్
బట్టితి మోడ్పుఁగేలును గృపంగను మమ్మ ! ననున్ మహేశ్వరీ !
తనకున్ సంతసమైన నిట్లనియె నద్దాక్షాయణీదేవి నీ
చను కార్యంబున నీకు నెల్ల యెడలన్ సాఫల్యమౌఁగాక ! రా
ముని వైదేహినిఁ గూర్చుమీ యనఁగ మున్ముందాకసంబైనఁ బా
వని సిద్ధాదినుతుల్ వియత్స్థలిని సంబాధంబు లేతేరగన్.
No comments:
Post a Comment