ద్భవచాంద్రీసుకుమారమౌనెద పరీపాకంబు శ్రీరామచం
ద్రవిలాసామృతమూర్తి వానియెడ మాత్సర్యంబు వాటించు నీ
చివురాకున్ మెదువైన గుండియకు నాశీర్వాదమే మంథరా !
కైక నల్లని వన్నీ నీళ్ళనీ, తెల్లని వన్నీ పాలని నమ్ముతుందని, దారిలో
అడ్డంగా ఉన్న తులసి మొక్కనైనా సరే నిర్దాక్షిణ్యంగా పెల్లగించాలని, పడగెత్తి పైకి వచ్చే రాముడు వంటి సర్పాన్ని చూస్తూ ఊరుకోవడ మేమిటని, మంథర దీర్ఘోపన్యాసం చేసింది. దానికి, ప్రతివాదం చేయటం తెలియని కైక నవ్వి ఇలా అన్నది.

" ఓసి మంథరా ! శ్రీరాముని హృదయం వెన్నలాంటిది. సంధ్యాకాలంలో, ఉదయించిన చంద్రుని వెన్నెల ఎంత సుకుమారంగా ఉంటుందో, అంత మెత్తగా, పరిపక్వమై ఉంటుంది అమృతమూర్తి రామచంద్రుని హృదయం. అటువంటి వానిపైన మాత్సర్యం చూపించే చిగురాకు కంటె మెత్తని నీ హృదయానికి ఆశీర్వాదం పలుకుతున్నానే ! "
పసిపిల్లవాడి మీద మంథర తన అక్కసు వెళ్ళబోసుకుంటున్నదన్న ఎత్తిపొడుపు కైక మాటల్లో ధ్వనిస్తున్నది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండములో మంథర కైకేయి మధ్య జరిగిన దీర్ఘ సంభాషణ, మంథర క్రమంగా కైకలో ఏ విధంగా మార్పు తీసుకువచ్చిందో సూచిస్తూ, కైక యొక్క మహోదాత్తమైన గుణాన్ని చాటిచెబుతున్నది.
No comments:
Post a Comment