గూలముతోడ నేగెఁ గపికుంజరుఁ డున్నమ దుజ్జ్వలత్పతా
కా లలితంబు నాకపతికల్పిత దివ్యరథంబువోలె మే
ఘాలికి మధ్య దేశమునయందున దాఁగిలిమూఁత లాటగా.
వారిధరంబు లొక్కొకటి వారిపృషత్తుల సాంద్రతాల్పతా
స్ఫార విభేద సంఘటన వారిజబంధు నవాంశుమండల
శ్రీరుచులెక్కు భేదమునఁ జిత్రిత మేఘచయంబునందుఁ గి
ర్మీరితదేహుఁడై చనె సమీరణపుత్రుఁ మేఘగాత్రుఁడై.
నాగమాత సురసను మెప్పించి, ఆమె దీవనలు పొంది, మరల ఆకాశమార్గంలో సముద్రంపై పయనిస్తున్న హనుమంతుడి వర్ణన ఇది.
హనుమ ఆకాశంలో పయనిస్తూ ఉంటే, వన్నెలు వన్నెలుగా ఉన్న తోక, అతని నెత్తి మీద ఇంద్రధనుస్సు లాగా భాసించింది. ఆ విధంగా పైకెత్తిన తోకతో, పతాకంతో కూడిన ఇంద్రుని దివ్యరథం లాగా, హనుమ మేఘమండలం మధ్య నుంచి దాగుడుమూతలాడుతూ వెళ్తున్నాడు.
ఒక్కొక్క మేఘం, సూర్యమండలం యొక్క కాంతి, నీటిబిందువుల మీద పడి, ఆ బిందువుల యొక్క సాంద్రతాభేదంతో, హనుమను వర్ణయుక్త స్వర్ణమయదేహంతో ప్రకాశించేటట్లు చేసింది. ఆ విధంగా వాయుపుత్రుడైన హనుమ, పలు వర్ణాలతో కూడిన మేఘశరీరుడై ప్రయాణం చేశాడు.
ఈ వర్ణన శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములో ఉంది.
No comments:
Post a Comment