స్సునఁ జొరరానివేళఁ బురసూదన ! నన్నును మించి పాలసుం
డని ధరనుండబోవఁ డకటా వికటంబుగ నెత్తికూలవే
సినగతిఁ జేయగా వలదు చిత్తము, దేవర చిత్త మాపయిన్.
ఇంత భక్తిపూర్వకంగా, హృదయానికి హత్తుకొనేటట్లుగా, అందంగా పద్యాన్ని వ్రాయడం ఒక్క విశ్వనాథకే సాధ్యం అని నా అభిప్రాయం.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము లోని అభిషేక ఖండము నందలి చివరి పద్యం. ఇందులో, విశ్వనాథ, గుండెలోతులను తెరిచి స్వామికి, తమ వేదనను విన్నవించుకుంటున్నారు.
" ఓ త్రిపురాసురసంహారీ, శివా ! నీవు మనస్సులో స్థిరంగా ఉన్నంత సేపు నేనొక యోగినని అనిపిస్తుంది. ఎప్పుడైతే నీవు ప్రక్కకు తప్పుకుంటావో, అప్పుడు నా అంతటి దుర్జనుడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడనిపిస్తుంది. అయ్యో! నా చిత్తాన్ని ఎత్తి కూలవేసినట్లు చెయ్యొద్దని వేడుకుంటున్నాను. ఆ పైన దేవరవారి ఇష్టం. "
హృదయం పరమేశ్వరాయత్తమైనంతకాలం, ఏ ఇతరములైన ఆలోచనలు రావు.
ఎప్పుడైతే భగద్భావన నుండి వైదొలగామో, అప్పుడు దేహభావన వచ్చి కూర్చుంటుంది. అందువల్లనే, విశ్వనాథ దేహభావనను తొలగించ గలిగిన శక్తివంతుడైన పురసూదనుడినే వేడుకుంటున్నాడు. పురము అంటే దేహం. దేహభావాన్ని పోగొట్టి ఆత్మభావాన్ని కలిగించగలవాడు పరమేశ్వరుడు.
ఈ పద్యం నిత్య ప్రార్థనకు, మనఃప్రక్షాళనకు ఎంతో ఉపయుక్తమైనది.
No comments:
Post a Comment