గ్రుడ్లని చూచుచున్ దొడిమఁ ద్రుంచుట తోఁచదు మూతిలేని వీ
బుడ్లనుచున్, జిలేబులను బూని విచిత్రపు టిప్పపూవులా
యొడ్లకు మీదు నాశ్రమ ఫలోన్నతి కల్గునె యంచు మెచ్చుచున్.
వహ్వా యంచు జిలేబి లడ్డులను నాస్వాదించి యానందమై
జిహ్వాతర్పణమై పురే యనుచు మీ చిత్రాశ్రమస్థానిలో
బహ్వానందము లింక నెన్నికలవో వత్తున్ నిజం బేను న
న్నాహ్వానించుట కేదియైనఁ గలదాఁ యభ్యంతరంబన్నచో.
శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ ఋష్యశృంగుని పాత్రను మలిచిన తీరు నాన్యతో దర్శనీయం.
ఋష్యశృంగుడిని నృత్యగాన విశేషాలతో ఆకట్టుకొని, వారుండే కుటీరాలకు తీసుకువెళ్ళారు వారకాంతలు. రాజుగారి కూతురికి కాబోయే పెనిమిటి అనే భావంతో చాలా ఆరాధనా భావంతో మెలిగారు. ఋష్యశృంగుడు తనను వారి ఆశ్రమాలకు తీసుకు వెళ్ళమని, అక్కడ తమ ప్రాంతాల్లో దొరికేటటువంటి పండ్లు దొరుకుతాయా అని అడిగాడు. దానికి సమాధానంగా, వారకాంతలు లడ్లు, జిలేబులు మొదలైన తీపివంటకాలను అతడి ముందు పెట్టారు. వాటిని చూసి అబ్బురపడిన ఋష్యశృంగుని అమాయక హృదయ వర్ణనమే యీ పద్యాల భావం.
" లడ్లు, జిలేబులు ఇవ్వగానే, వాటిని అటూఇటూ త్రిప్పి చూచి, అవి అడవి నెమళ్ళ గ్రుడ్లనుకొన్నాడు. పండ్ల వలె వాటికి తొడిమ త్రుంచనక్కర లేదనుకొన్నాడు. ఆ లడ్లు మూతి లేని బుడ్లంటూ ఆశ్చర్యపోయాడు. జిలేబులను చేతితో పట్టుకొని, అవి విచిత్రంగా ఉన్న ఇప్పపువ్వు లన్నాడు. తన వంటివారికి, వారి ఆశ్రమాలలో ఉన్న చక్కని పండ్లు దొరుకుతాయా అని వారిని మెచ్చుకున్నాడు.
ఆహా ! ఎంత రుచిగా ఉన్నాయంటూ లడ్లు, జిలేబులను తిని, జిహ్వకు ఆనందం కలిగి, వారి చిత్రమైన ఆశ్రమాలలో ఆనందం కలిగించే వస్తువు లింకెన్ని ఉన్నాయోనన్నాడు. తాను తప్పకుండా వారి ఆశ్రమానికి వస్తానన్నాడు. తనను ఆహ్వానించటానికి వారికేమైనా అభ్యతరం ఉందా ? అని అడిగాడు. "
బాల కాండము, ఇష్టి ఖండము లోని పై పద్యాలు ఋష్యశృంగుని నిర్మలమైన హృదయాన్ని, అమాయకపు మునివాసాన్ని తెలియజేస్తాయి.
No comments:
Post a Comment