అరయగ నూహశక్తి తనయంతన తాను ఘటిల్లునో పురా
భరిత మనంత సంస్కృతి శుభంబునఁ జేకుఱుఁగాక యట్లు చే
కుఱిన శుభంబుతోడ నొనగూడిన పూర్వపుఁబున్నె మాదుకో
స్ఫురణ ఘటిల్లుఁ బావనవిశుద్ధము తద్గతభావ మాత్మభూ !
" పరమశివా ! విచారించగా, మహాకవిత్వ రచనకు కావలసిన ఊహశక్తి తనంతట తానే అది కవికి ఒనగూరుతుందా? గత జన్మలలో సముపార్జించుకొన్న అనంతమైన సంస్కృతీసౌభాగ్యం వల్ల వస్తుంది. ఆ సౌభాగ్యానికి పూర్వపుణ్యఫలం తోడైతే, సత్కావ్య నిర్మాణానికి కావలసిన ఊహశక్తి స్ఫురిస్తుంది, తద్వారా, అతి పవిత్రమైన, నిర్మలమైన భావాలు కలుగుతాయి. "
మహాకవిత్వమనేది ఒక ఉపాసన, తపస్సు. దానికి, పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మల పుణ్యం కూడా తోడ్పడాలి. అప్పుడే సత్కావ్య నిర్మాణానికి కావలసిన సామాగ్రి సమకూరుతుంది. అది భగవత్ప్రసాదితం.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అవతార ఖండము నందలి పద్యం.
No comments:
Post a Comment