చదువుల పుట్టినిండ్లు, శమసంపద ఇక్కలు, పుణ్యలక్ష్మికిన్
మొదలి దివాణముల్ సురసమూహము నాకటిపంట లంచితా
భ్యుదయ నిసర్గబంధువులు, ప్రోడతనంబుల ఠాణముల్ పురిన్
పొదలెడు భుసురోత్తముల భూరిపవిత్రశరీరవల్లరుల్.
ఇది కాశీ క్షేత్రంలో నివసించే బ్రాహ్మణులను వర్ణించే పద్యం. ఆ బ్రాహ్మణులు చాలా పవిత్రమైనవారు అని కవితాత్మకంగా భూరిపవిత్రశరీరశరీరవల్లరుల్ అన్నారు. అనగా, మిక్కిలి పవిత్రమైన శరీరములనే తీగలు కలవారు అని అర్థము.
ఇంకా యెటువంటివారు? చదువుల పుట్టినిళ్ళు, శాంతికాముకులు (ఇక్కలు=స్థానములు), పుణ్యం కొలువుండే చోటులు (బహు పుణ్యాత్ములు), దేవతల ఆకలి తీర్చేవారు (యజ్ఞయాగాది క్రియలు చక్కగా నిర్వహించేవారు), అందరి శ్రేయస్సు కోరేవారు, మంచి నైపుణ్యం కలిగినవారు.
మనం చేసే పనులు మనమేమిటో చెబుతాయి. ఆ ఊరిలోని బ్రాహ్మణులు కూడా అంతే. వారు చేసే పనులే వారి గొప్పదనాన్ని సూచించాయి.
ఈ పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసం లోనిది.
No comments:
Post a Comment