శ్రీమదాంధ్ర మహాభాగవతములో పోతనగారు చేసిన ఇష్టదేవతా ప్రార్థనలో బ్రహ్మదేవుని గురించి చేసిన స్తోత్రమిది.
ఆతత సేవ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకు, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
త్రిమూర్తులలో ఒకడయిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త, సరస్వతికి భర్త, వేదములను విభాగించినవాడు, దేవతలను తీర్చిదిద్దేవాడు, పాపాలను పోగొట్టేవాడు, దీనులను ఉద్ధరించేవాడు, తపస్సు చేసి మెప్పించిన వారికి వరా లిచ్చేవాడు, శుభం కలిగించేవాడు.
ఇన్ని గుణాలున్నాయి బ్రహ్మదేవుడిలో.
ఇది మంచి ప్రార్థనాపద్యం.
No comments:
Post a Comment