వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివం చనిపించుకో వృథా
యాసము గాక కట్టుకత లైహికమా? పరమా? యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవుని వేదన రెండు నేకమై
నా సకలోహవైభవ సనాథము నాథకథన్ రచించెదన్.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోని యీ పద్యము, ఏ యే అంశములు విశ్వనాథవారిని రామాయణ రచనకు పురికొల్పాయో, సుస్పష్టముగా తెలియజేస్తుంది.
వ్రాస్తే రామకథను వ్రాసాననిపించుకో గానీ, కట్టుకతలు వ్రాస్తే పుణ్యమా? పురుషార్థమా? అని విశ్వనాథవారి తండ్రి గారన్నారట. దానికి , లోపల నున్న జీవుని వేదన తోడయింది. ఈ రెండు కలసి, తన అన్ని ఊహల మేళవింపుగా, జగన్నాథుని కథను వ్రాస్తానన్నారు.
కట్టుకతలు అనగా ఈ సంసారానికి కట్టివేసే కథలు. మరి, ఎటువంటి కథలు కావాలి? విప్పు కథలు కావాలి. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తుడిని చేసే కథలు కావాలి. అవి భగవంతుని కళ్యాణ గాథలయిన భారత, భాగవత, రామాయణాదులు.
ఆశర్యకరంగా, శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథవారి వేదనతో పాటు కథాగతంగా బహుజీవుల వేదన కనిపిస్తుంది. చివరకు అవతారమూర్తియైన రాముడు కూడా దానికి అతీతుడు కాదు. ఈ విషయము " అమ్మా! దేహమనన్ విచిత్రమగు దుఃఖారామ మనుపించు" అని రాముడు తల్లి కౌసల్యతో వెలిబుచ్చిన నిర్వేదంలో కనిపిస్తుంది.
No comments:
Post a Comment