హరునకు నెద్ది పేర్మి, దనుజారికి నెద్ది రమావిభూతి, భా
స్కరునకు నెద్ది తేజము, దిశాపతి సంహతి కెద్ది నిల్పు, చం
దురునకు నెద్ది కాంతియు, జతుర్దశలోకవిభుత్వ మెద్ది నీ
కిరవుగ నా కుమారు డిక నింకొక యించుక సేపు నిల్చినన్?
సరోవరంలో పుట్టి, అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న కుమారస్వామిని చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే, కలహభోజనుడైన అతనికి ఒక ఆలోచన వచ్చింది. వీరుడైన కుమారస్వామితో, దేవేంద్రుడు యుద్ధం చేసేటట్లు పురిగొలిపితే, ఆ రోజుకు భోజనం చేసినట్లవుతుందని అనుకున్నాడు. నేరుగా దేవేంద్రుని వద్దకు వెళ్ళి, యీ విధంగా చెప్పాడు.
" ఈ పిల్లవాడు ఇంకా కొంచెం చేపు భూమిపై నిలిచి ఉంటే, శివుని గొప్పతనము, విష్ణువు లక్ష్మీసంపద, సూర్యుని తేజస్సు, దిక్పాలకుల నిలకడ, చంద్రుని కాంతి, నీ చతుర్దశలోక ఆధిపత్యము మరుగున పడిపోతాయి. "
నన్నెచోడకృత కుమారసంభవము కావ్యం దశమాశ్వాసం లోని యీ పద్యం కుమారస్వామి గొప్పతనాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తులో దేవతలకు సేనాని అయ్యే లక్షణాన్ని సూచిస్తున్నది.
No comments:
Post a Comment