శీతాహార్య సుతాళినీ వికచరాజీవంబు విశ్వేశ్వర
జ్యోతిర్లింగ విశుద్ధ రత్నఖని మోక్షోపాయ దుగ్దాబ్ధి వే
లాతీరావని డుంఠినామక గజాలానంబు గంగామృత
స్రోతోనిస్సృతి చంద్రగోళమన మించుం గాశి శ్రీరాశియై.
ఇది తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసము నందు గల కాశీ క్షేత్రమునకు సంబంధించిన వర్ణన పద్యము.
కాశీ క్షేత్రము ఎటువంటిది?
శీతాహార్యసుత, హిమవంతుని కూతురు, పార్వతి అనే ఆడుతుమ్మెదకు వికసించిన పద్మము. విశ్వేశ్వర జ్యోతిర్లింగమను స్వచ్ఛమైన రత్నమునకు నిధి. మోక్షసాధనమగు పాలసముద్రమునకు ఒడ్డు. డుంఠి అనే ఏనుగును కట్టివేసిన స్థలము. కాశిలో డుంఠి వినాయకుడు ప్రసిద్ధి. గంగ అనే అమృత ప్రవాహమును స్రవించే చంద్రమండలము. మరి ఇన్నిటికి తావైన కాశీక్షేత్రము సంపదలకు పుట్టినిల్లు కాకుండా ఉంటుందా?
కాశీ క్షేత్రము అనగానే మనకు చప్పున గుర్తుకు వచ్చేవి వీశ్వేశ్వరాలయము, విశాలాక్షి, డుంఠి వినాయకుడు, పవిత్ర గంగానది. ఈ విశేషాలతో ఇంత అందంగా పద్యం చెప్పడము రామకృష్ణునికే చెల్లింది.

No comments:
Post a Comment