అంపశయ్య మీద నున్న భీష్ముడు ధర్మరాజుకు రాజనీతికి సంబంధించిన పలు విషయాలు బోధించిన తరువాత, ధర్మరాజు, మంచి పనులు చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి వినాలనే కోరికను వెలిబుచ్చాడు.
దానికి సమాధానంగా, మనిషి కోరికలు యెంత బలవత్తరమైనవో వివరిస్తాడు భీష్ముడు. ముసలితనంతో పాటు, జుట్టు, పళ్ళు, చెవులు, కళ్ళు, వీటన్నిటికీ ముసలితనం వస్తుంది. కానీ, కోరికకు మాత్రం ముసలితనం రాదు. ప్రాణం పోయేటంతవరకు చావని రోగమది. పామరులేమో అది త్రోసివేయలేరు, పండితులేమో సుఖాలను మరిగి, దానిని పోగొట్టుకుందామన్న ఆలోచన కూడా మనసులోకి రానీయరు. ఇంతే తేడా.
తిక్కన భారతం, ఆనుశాసనికపర్వం లోని యీ పద్యం, మనిషికి కోరికను జయించటం యెంత కష్టమో, తెలియజేస్తుంది.
No comments:
Post a Comment