తగు నిది తగ దని యెదలో
వగవక సాధులకు బేదవారల
కెగ్గుల్ మొగిజేయు దుర్వినీతుల
కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్.
జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ప్రదేశానికి సరమ అనే పేరు కల దేవతలకుక్క కొడుకైన సారమేయుడు అనే కుక్కపిల్ల వెళ్ళి ఆడుకుంటుండగా, జనమేజయుని తమ్ముళ్ళు కొట్టారు. దానికి సరమ కోపించి, జనమేజయుడిని యీ విధంగా ప్రశ్నించింది.
" ఈ పని చేయతగినదా, చేయతగనిదా అని కొంచెము కూడా ఆలోచించకుండా, మంచివారికీ, పెద్దవారికీ, పేదవారికీ, కావాలని కీడు తలపెట్టేవారికి, నీతి లేనివారికి, కారణము లేకుండగానే ఆపదలు వస్తుంటాయి. "
నన్నయగారి సూక్తినిధిత్వానికి ఇది చక్కని ఉదాహరణ. అంతేగాక, యీ పద్యము కౌరవుల ధూర్తత్వాన్నీ, దుష్టత్వాన్నీ ధ్వనింపజేస్తూ, భావి కథార్థాన్ని సూచిస్తున్నది.
ఈ పద్యము నన్నయ భారతము ఆదిపర్వములో ఉన్నది.
No comments:
Post a Comment