పావు నెఱుంగు బ్రహ్మ సగపాలును మాత్ర మెఱుంగు బార్వతీ
దేవియు నీ వెఱుంగుదువు తెల్లము రామ మహత్తు కృత్స్న మా
దేవున కేను నీ యనుమతిం బడి నంకితమిత్తు జానకీ
దేవి మనోహరుండు రఘుదేవుని సాధుకథా ప్రపంచమున్.
ఈ పద్యం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోనిది.
పద్యం భావము సుగమమే. చాలా పురాణ కథలు శివుడు పార్వతికి చెప్పినట్లు కావ్యాల్లో చదివాము. శివకేశవులకు అభేదము కనుక, రామ మహత్తు ఆయనకొక్కడికే సంపూర్ణముగా తెలుసు. శివుని దేహములో పార్వతి సగము కనుక, ఆమెకు సగము మాత్రమే తెలుసు. తక్కినవారికి అంతకంటే యెక్కువగా తెలిసే అవకాశం లేదు.
నా అల్పబుద్ధికి ఇంత మాత్రమే అర్థమయింది. కానీ, ఋష్యాత్మయైన విశ్వనాథవారి వాక్కు నా అల్పపు ఊహకు అంది ఉండదని మథనపడుతుంటాను. పెద్దలు యీ పద్యభావాన్ని విడమరచి చెబితే ధన్యుణ్ణవుతాను.
హృదయాన్ని హత్తుకొనే పద్యం.
No comments:
Post a Comment