దిగము మఱింత యింత యయి యేళ్ళులువాఱె, దతంతరంతర
స్థగిత రఘూద్వహప్రవిలసచ్ఛిశుమూర్తి మఱింత యింతయై
జగములు పట్టరాని యొక సాహస దీర్ఘతనుత్వ మొప్పగన్.
దశరథుని కొడుకులకు ఉపనయనం జరుగుతున్నది. వటువు రాముడు ముగ్గురు తల్లుల దగ్గర ' భిక్షాం భవతి దేహి ' అని అడుగుతున్నాడు. కైకమ్మ మణులతో కుట్టి, పిడి దగ్గర పట్టువస్త్రం చుట్టి, మరకతం పొదిగినటువంటి చురకత్తిని, వజ్రాలతో కూర్చినటువంటి వాలుటమ్మును భిక్షగా జోలెలో వేసింది.
" రాముని ముఖం వింత కాంతులు కురిపిస్తుండగా మురిసిపోయాడు. కైకమ్మ కళ్ళలో చల్లదనం మరింత పెరిగి యేరులాగా ప్రవహించసాగింది. అంతరాంతరాళాల్లో పొరలు పొరలుగా కప్పబడి ఉన్నటువంటి స్వస్వరూపంజ్ఞానం ఒక్కసారిగా కలిగిన రఘువంశ శిశువు తాను జగములు పట్టరానంత దీర్ఘశరీరం కలవాడిగా భావించాడు. "
కైకమ్మ భిక్షగా పెట్టిన వస్తుజాలం రామునికి తన అవతార లక్ష్యాన్ని గుర్తు చేసి, శిశుత్వాన్ని కప్పివేసి, తన యొక్క త్రివిక్రమస్ఫూర్తిని తెలియజేసింది.
పద్యం లోని ' యింతయై ' ' మఱింత యింత యయి ' అన్న పదాలు ' మాటలలో చెప్పలేనంత ' అన్న అర్థాన్నిస్తూ, శ్రీమహావిష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని, వామనావతారం లోని త్రివిక్రమాకారాన్ని స్ఫురణకు తెస్తున్నాయి.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనిది.
No comments:
Post a Comment