మ క్రోధంబు లహో ! ప్రమాణతను సంపాదించె నా యందు, నీ
యక్రూరత్వము నీ వశిత్వమును నా యం దింత పొందింపవే !
అక్రీతుండగు దాసుఁడన్ శివ శివా యన్నాను, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై ఆరో పద్యం.
" విశ్వేశ్వరా ! చేతులెత్తి మొరబెట్టుకొంటున్నాను ప్రభూ ! ఇవేమి కామక్రోధాలు? అయ్యో నాలో పీట వేసుకొని కూర్చున్నాయే? నీ కారుణ్యాన్ని, నీ ఇంద్రియ నిగ్రహాన్ని నాకు కూడా కొంత వచ్చేటట్లు చూడు. మాతృగర్భాన పుట్టిన నీ సేవకుడిని. శివా శివా అంటున్నాను, నన్ను కరుణించు. "
క్రీతుడు అంటే జననీజనకులకు కాకుండా అన్యంగా జనన మొందినవాడు. మనస్సు ఇంద్రియాలను వశపరచుకొని విషయవ్యాపారల వైపుకి దృష్టి మరలిస్తుంది. మనస్సును జయించినవాడు మహాదేవుని చేరగలుగుతాడు.
No comments:
Post a Comment