శ్రీకార శ్రవణాంబుజాత రుచిమత్స్మేరాననానంద కు
ల్యాకల్యాణ తరంగవత్రివళి సంలగ్నాత్మసంధాన ! వ
ర్షాకాలాంబుద సంస్రవజ్జలలవాచ్ఛశ్రీకి, విశ్వేశ్వరా
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఒకటో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ కరుణకు సాటి యేదో తెస్తున్నాను, విను. పార్వతి యొక్క అందమైన కడగంటి చూపులను, శ్రీకారముల వలె నున్న (శుభప్రదమైన) పద్మాల వంటి చెవులను, కాంతివంతమైన అరవిరిసిన ముఖాన్ని, ఆనందసరోవరపు తరంగాలు అనబడే కళ్యాణప్రదమైన నూగారును తనివితీరక వీక్షించే ఆత్మసంధానం కలవాడివి నీవు. నీ కరుణ వర్షాకాల మేఘాలు కురిపించే స్వచ్ఛమైన నీటిజల్లు వంటిది. "
పార్వతీదేవి వంటి అందమైన స్త్రీ ఈ విశ్వంలో లేదు. అమ్మవారి అందానికి హక్కుదారు అయ్యవారు. శివుడు అర్థనారీశ్వరుడు. వారిద్దరిదీ విడదీయరాని ఆత్మానుసంధానం. ఆమె ప్రకృతిస్వరూపిణి. దృశ్యమాన జగత్తులోని జీవులలో నిద్రాణంగా ఉన్న శక్తిరూపిణి. సహస్రారంలో, నిశ్చలమైన, నిర్భరమైన, యోగసమాధిలో నున్న శివుని ఆత్మ, మూలాధారంలో నున్న శక్తి పైన లగ్నమై ఉంటుంది. ఆయన ఆత్మ ఎప్పుడూ అమ్మవారి ఆత్మతో అనుసంధానమై ఉంటుంది. వారిద్దరిదీ స్త్రీపుంసయోగాత్మకమైన చైతన్యస్వరూపం. యోగమార్గంలో, జీవునిలో నున్న శక్తిని ఉద్దీపితం చేసి, సహస్రారంలో నున్న శివునితో అనుసంధానం చేయటమే జీవబ్రహ్మాత్మైక్యాను సంధానం. అందువల్లనే, విశ్వనాథ " సంలగ్నాత్మసంధాన " అన్న విశేషణాన్ని వాడారు.
No comments:
Post a Comment