శ్రీకృన్మోహన వర్ణ భాద్రపదసం శ్లేష ప్రగర్జద్విలా
సై కాంభోద తనూ ప్రకాశిత వధూ సౌదామనీ దేహవ
ల్లీ కళ్యాణమనోజ్ఞదీధితి కరాళీ కేళి, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభైమూడో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ దయ ఎంతటిదో చూపుతాను. నీలాకాశం లోని, అత్యంత సుందరమైన నీలవర్ణ కాంతులను విరజిమ్మే, అత్యంత సుందరమైన భాద్రపదమాసపు, గర్జించే నల్లని మేఘం కడుపులో ప్రకాశించే మెరుపుకన్య శరీరలావణ్యం యొక్క విలాసనృత్యం నీ కరుణ. "
ఈ పద్యం కూడా ఒకే ఒక దీర్ఘ సంస్కృత సమాసంలో ఉంది. భగవంతుని సృష్టి విలాసమే ఈ ప్రకృతి సౌందర్యం. ఆరు ఋతువుల లోని ప్రకృతి సౌందర్యం, సౌభాగ్యం ఆయన కరుణా విశేషమే అన్నది మహాకవి భావన.
No comments:
Post a Comment