సామాన్యంబులునై కనంబడెడిపో ! జాల్ముల్ మనోభావమం
దేమో వహ్నులు పైకి వెన్నలు, జగం బీ రీతిగా సాగెడిన్,
భూమీదేవుల దుష్టు లందురు జనమ్ముల్ చూడు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభయ్యారో పద్యం.
" విశ్వేశ్వరా ! విప్రుల మనస్సు అతి మెత్తగాను, వారి మాటలు రాయి లాగా కఠినంగాను కనబడతాయి. కపటత్వం కలవాళ్ళు మనసు లోపల నిప్పుల కుంపటి పెట్టుకొని, పైకేమో వెన్న లాగా మెత్తగా కనిపిస్తారు. లోకమంతా యీ రీతిగానే సాగుతున్నది. మెత్తని మనసున్న విప్రులని యీ జనాలు చెడ్డవాళ్ళంటారు చూడు స్వామీ ! "
నన్నయగారు ఆంధ్ర మహాభారతం లోని ఉదంకోపాఖ్యానంలో " నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము (విప్రుని యొక్క నిండైన మనస్సు అప్పుడే తీసిన వెన్న లాంటిదని, మాట మాత్రం వజ్రాయుధం కంటె పదునైనది) " అని బ్రాహ్మణుని యొక్క స్వభావాన్ని గురించి చెప్పారు. విశ్వనాథ, అదే భావాన్ని యీ పద్యంలో పొదిగి, లోకం రీతిని వివరించారు.
No comments:
Post a Comment