నూనవ్యాహృతి మాధుపంచమము చిందున్ ద్యోనదాంభఃకణ
శ్రీనృత్యంబులు సూపు నా కవిత తండ్రీ ! నా హృదంభోజ మం
దానందచ్యుతి పొంది నీ శతక మిట్లై పోయె, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై తొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నా కవిత్వంలో తేనెవాకలు పారుతాయి. మేఘగర్జనలు ప్రతిధ్వనిస్తాయి. ఆడు కోయిలల కుహూకుహూరావాలు వినిపించి మధుమాస సోయగం చిందులాడుతుంది. ఆకాశగంగ నీటితుంపరలు నాట్యం చేస్తాయి. నా హృదయపద్మంలో ఆనందం కొంత తరిగిపోయి, ఈ శతకం యీ విధంగా తయారయింది. "
ఈ పద్యంలో విశ్వనాథవారి మహాకవిత్వ లక్షణాలు వివరించబడ్డాయి. వారి కవిత్వంలో అచ్చ తెలుగు పదాల తియ్యదనం ఉంది. సంస్కృత సమాసాలతో కూడిన ప్రౌఢకవిత్వం ఉంది. ప్రకృతి వర్ణన లున్నాయి. అందమైన కల్పన లున్నాయి. సర్వలక్షణ సంగ్రహం వారి కావ్యాలు.
No comments:
Post a Comment