నని యే దారినిఁబోయి పూర్వకవి పాదాంకంబులే తోఁచి లో
నన లజ్జాపరిగూఢ మానసుఁడనై నాలోన నేనే వినూ
తన శంకాహృదయుండ నౌదును, మఱి క్షంతవ్యుండ, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని వందో పద్యం.
" విశ్వేశ్వరా ! నిన్ను క్రొత్త క్రొత్త పద ప్రయోగాలతో వర్ణించాలని ఉహిస్తాను. అలాగని, పోయి పోయి పూర్వాంధ్ర మహాకవుల మార్గమే తోచి, సిగ్గు పడి, అది నా మనసులోనే దాచుకొని, నాలోపల నేనే సరిక్రొత్త సందేహాలతో కూడిన హృదయం కలిగిన వాడినౌతున్నాను. మరి నన్ను క్షమిoచు తండ్రీ !
నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, నాచన సోమనలను తనకు గురువులుగా అవతారికలో చెప్పుకొన్నారు విశ్వనాథ. వారిని గురువులుగా భావించి, వారి స్ఫూర్తిని పొందుతూ, తనదైన స్వతంత్ర మార్గంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షము వంటి బృహత్కావ్య రచన చేశారు విశ్వనాథ.
No comments:
Post a Comment