క్కని దైవంబు తలంపగా వలయునే కానీ మఱింకెట్లు మా
నును? స్వీయావిలపాపకార్యచరణాంధు ప్లుష్ట వాః ప్లావనం
బును పశ్చాత్తపనంబు నిత్యమయి యేమో ప్రాప్తి? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై మూడో పద్యం.
" విశ్వేశ్వరా ! మనస్సు గురించి ఏమని చెప్పమంటావు? మనస్సు పోయే వంకర దారుల నుంచి దానిని మాన్పించాలంటే, నీ వంటి అసలు దైవం తలచుకోవాలి కానీ, ఇంకొక రీతిగా ఎలా మాన్పించగలం? స్వయంగా చేసుకొన్న పాపకార్యాలనే అంధత్వాన్ని కాల్చివేసుకొనడానికి, కడిగివేసుకొనడానికి, పశ్చాత్తాపం చెందడం నిత్యకృత్యమైపోయింది. మరి చివరికి నా కేది ప్రాప్తిస్తుందో, స్వామీ ! "
మనస్సు చాలా చంచలమైనది. పాపకార్యాచరణకైనా, పుణ్యకార్యాచరణకైనా మనస్సే కారణం. మనస్సు పోకడలను నిరోధించాలంటే, దయామయుడైన పరమేశ్వరుని అనుగ్రహం కావాలి. చేతులారా చేసిన పాపాలు నిష్కృతి పొందాలంటే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందడమే మార్గం. ఆ తరువాత, ప్రాప్తం భగవంతుని చేతిలో ఉంది.
No comments:
Post a Comment