రో జవసత్వముల్ కలిగియుందురు పుత్రులు యౌవనోదయ
శ్రీ జయశాలులై, పితలు చేతికి గుప్పెడు కారు త్రెంచినన్
గాఁజరలట్లు వ్రీలెదరు కాదె మఱేటికిఁ జేయ రా గతిన్.
తల్లియుఁ దండ్రి తమ్ములును ధారణినాథుఁడు నన్నదెల్ల నీ
యుల్లము లోపలన్ఁ గలుగు నూహలు, భావసమాశ్రితంబు, లీ
యెల్లయు ధర్మ, మిద్ది యెవఁడేనియుఁ బాలన సేయు మానవుం
డల్లఁతడొక్కడున్ పెఱజనావళి హావళి తెచ్చు రక్కసుల్.
ఈ శ్రీరాముడు వనవాసానికి వెళ్ళటానికి ముందు తల్లి కౌసల్య వద్దకు వచ్చి విషయాన్ని వివరించాడు. ఈ విషయం తెలుసుకొన్న లక్ష్మణుడు కోపోద్రిక్తుడయ్యాడు. తల్లి, తండ్రి, ప్రజలు, ఎవరడ్డమొచ్చినా, వారిని శిక్షించి రామునికి పట్టాభిషేకం జరిగేటట్లు చూస్తానన్నాడు. ఆ మాటలకు నొచ్చుకొన్న రాముడు లక్ష్మణునికి మానవ బంధాలను గురించి చెప్పాడు.
" ఏ తండ్రికైనా వార్థక్యం వచ్చేసరికి జవసత్వాలు ఉడిగిపోతాయి. ఇక పిల్ల లంటావా, యవ్వనోదయంతో జవసత్వాలు కలిగి దేనినైనా, ఎవరినైనా ఎదిరించేటట్లుంటారు. పాపం తల్లిదండ్రులు వీరి గుప్పెట్లోకి కూడా రారు. గాజరగడ్డల లాగా పడిపోతారు కదా ! మరి పిల్లలు వారి నెదిరించరెందుకు?
తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, రాజు, అన్నటువంటి వన్నీ నీవు మనసులో నిర్మించుకొన్న ఊహలు. ఇవన్నీ నీ భావాలను అంటిపెట్టుకొని ఉంటాయి. ఇదంతా ధర్మం అంటారు. ఈ ధర్మాన్ని మనిషిగా పుట్టిన ఎవడైనా పాటిస్తాడు. అట్లా పాటించని వాళ్ళు కీడు తలపెట్టే రాక్షసుల క్రింద లెక్క. "
రాముడు మానవుడిగా అవతరించింది ధర్మస్వరూపాన్ని మానవులకు తెలియజేసి, వారిని సన్మార్గ వర్తనులుగా తీర్చిదిద్దటానికి.
అహో ! ఏమి రాముడు ! ఏమి విశ్వనాథ దర్శనం ! భారతీయులదేమి భాగ్య విశేషం !
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment