ట్లే వేలూహలుగాఁగఁ దెచ్చుకొని నీవే కాక లేఁడే కదా !
దైవంబంచును నా కవిత్వము భవత్పాదద్వయిన్ జేర్చితిన్
రావే దీనికి నే ఫలం బొసఁగెదో రానిమ్ము, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభైనాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! నీవు కనిపించకుండా ఉన్నాగానీ, కనిపించినట్లుగానే వేలకొద్దీ ఊహలు చేసుకొని, ఇక నీవు తప్ప అన్యదైవం లేడని, నా కవిత్వాన్ని నీ పాదార్పణం చేశాను. దానికి ఎటువంటి ఫలిత మిస్తావో, ఇవ్వు. అంతే స్వామీ ! "
విశ్వనాథ, వారి బృహత్కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని పరమేశ్వరాంకితం చేశారు. కల్పవృక్షం ఖండాంత పద్యాలలో, పునరావృత్తిరహిత మోక్షసిద్ధి కోసం మహాకవి యొక్క వేదన కనిపిస్తుంది. ఆయన, తన గుండెను, పరమేశ్వరుని గుండెతో రాపిడి పెట్టాననీ, దాని కేమైనా ఫలముంటే ఇవ్వమనీ, పరమేశ్వరుణ్ణి వేడుకొన్నారు.
No comments:
Post a Comment