మానవజాతి విచిత్ర మయినది. కొందరు వట్టి క్షుద్బధానివారణమాత్రజీవులు. మరికొందరు శరీర సౌఖ్యమార్గాన్వేషణాపరులు. ధనము యొక్క లేమియు, గలిమియు నిట్టి మానవ ప్రకృతిభేదమునకు హేతువులుగా చెప్పదగినట్లు కనిపించును. యథార్థమునకు ధనము తత్స్వభావభేదమునకు కారణము కాదు. కొందరు సహజముగా సుఖలాలసులు. కొంద రూఱకే బ్రదుకుదురు. ధనవంతుల యిండ్లలోననే కొంద రేమి వేసి పెట్టినను తిందురు. కొందరి కాపదార్థమున్ననే రుచించును. ఇది ధనవంతుల యిండ్లలోననే కాదు పేద సంసారములలో కూడ నిట్లే యుండును. ఒకడు తన కిష్టమైన వ్యంజనము లేక ముద్ద యెత్తడు. ఇది ప్రకృతిసిద్ధమైన భేదము.
- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: భగవంతుని మీది పగ: పురాణవైర గ్రంథమాల:1
No comments:
Post a Comment