నై టాటోటుగ సోడుముట్టెను వికృష్టాఘ్రాణ పర్యంత మా
ర్గాటోపంబుల లోచనేంద్రియ పథవ్యాపార లుంటాకమై
పాటో పోటొ భవత్కృపాధునికిఁ చెప్పన్ జాల, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై నాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! అధికంగా విరగకాసిన తెల్లని వెన్నెల, నీ తలలో పెట్టుకొన్న తెల్లకలువ (సౌగంధికపుష్పం) పరిమళంలాగా మారి, నన్ను ఏమార్చి, నాసికామార్గాన్నంతా సువాసనా భరితం చేస్తూ, వడి వడిగా కంటిదారిలో పొర్లుకొంటూ, నా మాడు నంటింది (బ్రహ్మరంధ్రాన్ని తాకింది) ప్రభూ ! అది మరి నీ దయాప్రవాహపు పొంగు తగ్గుదలో లేక హెచ్చుదలో నేను చెప్పలేకుండా ఉన్నాను స్వామీ ! "
భగవత్కృప అనే మహాప్రవాహంలో తేలియాడేవాడు ఉక్కిరిబిక్కిరైపోతాడు. అది తేనెలో పడ్డ ఈగ పరిస్థితి వంటిది. అందుచేత, అది పరమేశ్వరుని కృపాప్రవాహపు ఆటో పోటో తెలియని పరిస్థితిగా చెప్పలేనిదని మహాకవి భావన.
No comments:
Post a Comment