గేవల సత్త్వమూర్తియగు కేకయనాథు నసృక్ప్రవాహముల్
భావము లోపలన్ దెలియఁబట్టని చోటుల మూలసత్త్వగం
ధావలితంబులై పరిణతాకృతి భద్రములౌఁ దదూహలున్.
గర్భవతి యైన కైక హృదయాంతరాళాలలో నిక్షిప్తమై ఉన్న భిన్న ప్రవృత్తులను గురించి చెప్పిన పద్యమిది.
తల్లి లేని లోటు తీరుస్తూ, మంథర కైకను చిన్నతనం నుండి పెంచి పెద్దచేసింది. కానీ, తల్లి పెంపకానికి దాది పెంపకానికి తేడా ఉంది. అందునా, సరియైన పెంపకం లేని రాచసంతానంలో మాట నెగ్గించుకొనే గుణం ఎక్కువగా ఉంటుంది. మరి అది గర్వమో, పట్టుదలో, సరసమో తెలియదు కానీ, కైకకు మంథర ఇవన్నీ నేర్పింది.
" కైక రక్తనాళాల్లో, పైన చెప్పిన గుణాలన్నీ అతిశయించి, జన్మతః సాధుస్వభావుడైన తండ్రి కేకయరాజు రక్తప్రవాహం, భావరూపంగా తెలియరాని చోటుల్లో, అసలైన సత్త్వ స్వభావ వాసనలను పులుముకొని, పరిపక్వ దశకు వచ్చి, ఊహలుగా భద్రంగా ఉన్నాయి. "
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనిది.
ఈ పద్యంలో విశ్వనాథ, కైక బాహ్యప్రవృత్తిని, ఆంతరంగిక ప్రవృత్తిని చక్కగా తెలియజేశారు. తల్లి లేని పిల్ల అయిన రాజుగారి కూతురు కైకకు మంథర నేర్పించిన బుద్ధు లొక వైపు, రక్తనిష్ఠంగా తండ్రి కేకయరాజు సత్త్వగుణ సంపద ఒక వైపు కైక భావాంతరాళాల్లో భద్రంగా నిక్షిప్తమై ఉన్నాయని మహాకవి భావన.
No comments:
Post a Comment