వస్థామార్గము నువ్వుగింజయిన దప్పన్ బోదు లోఁ గాల
మేఘస్థూలాకృతి నల్లనైన పొగయై కట్టెన్ వెలారెన్ మన
స్స్వస్థంబని నేఁటి జన్మకె గడింపన్ లేనొ విశ్వేశ్వరా !'
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై తొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత మొదలగునవి సూచించిన జీవనమార్గాన్ని ధర్మ మార్గాన్ని తప్పను. అలాగని, దుస్తరమైన కోరికలతో కూడిన అవస్థల దారి నుండి నువ్వుగింజంతైనా తప్పించుకోవటం కూడా సాధ్యం కాకుండా ఉంది. ప్రళయకాల మేఘం దట్టంగా, నల్లగా ఎలా అలుముకొంటుందో, ఆ విధంగా అజ్ఞానం, నా లోపల ఆవరించుకొని ఉంది. మనశ్శాంతి అనేది ఇక ఈ జన్మకు దొరకదా స్వామీ ! "
వేదాంతములైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయ మంటారు. ఇవి మానవజీవితంలో ఆచరణయోగ్యములైన గ్రంథాలు. నిష్కామ కర్మతో, తామరాకు మీద నీటినొట్టులాగా, సుఖదుఃఖాలు, మానావమానాలు, కలిమిలేములు, మొదలైన ద్వంద్వాలకు అతీతంగా, శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందటమే మానవజీవితానికి సార్థకత చేకూర్చేది. పైన చెప్పిన బృహద్గ్రంథాల సారాన్ని నిజజీవితంలో ఆచరించి, నిష్కామ కర్మాచరణ చేస్తూ, సమన్వయంతో బ్రతకటం కష్టతరమైన పని. అందువల్ల, కోరిక వలయoలో చిక్కుకొన్న మనిషి మనశ్శాంతిని కోల్పోతున్నాడని విశ్వనాథ ఆవేదన.
No comments:
Post a Comment